- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవ్వడం ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి సొమ్ముతోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో 600 మద్యం షాపులు పెట్టిందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా సంచలం సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో త్వరలోనే కవిత అరెస్టవ్వడం ఖాయం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను మళ్లించడానికే బీఆర్ఎస్‌గా మార్చారని అన్నారు. మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. 55 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు అమ్ముడుపోలేదని అన్నారు.
రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి పుట్టలే.. పుట్టబోదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను బొందపెట్టే వరకు తన పోరాటం ఆగదని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, దేశంలో సంచలనం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కూతరు, ఎమ్మెల్సీ కవిత త్వరలోనే అరెస్ట్ అవతుందంటూ రోజుకో బీజేపీ నేత కామెంట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే టీ-బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి సైతం కవిత త్వరలోనే అరెస్ట్ అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.