- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాది పేగు బంధం.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే సోనియా గాంధీ అని.. తమ కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉందని ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. మాజీ ప్రధాని నెహ్రూ తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారు.. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి మళ్లీ వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. దీంతో వందలాది మంది చనిపోయారని ధ్వజమెత్తారు. తెలంగాణను ఎవరూ ఇవ్వలేదని.. కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు.
రాజకీయ అవసరాల కోసమే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాహుల్ గాంధీ గతంలో ఎప్పుడు మాట్లాడలేదని.. ఇప్పుడేమో తెలంగాణతో తమ కుటుంబానికి సంబంధం ఉందంటున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణతో కాంగ్రెస్‌ది ఎన్నికల బంధం.. మనది పేగు బంధమని కవిత అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి.. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆమె జోస్యం చెప్పారు.