40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా.. హైకమాండ్‌పై జీవన్ రెడ్డి ఫైర్

by Anjali |
40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా.. హైకమాండ్‌పై  జీవన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధ పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. 40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ గొంతెత్తి ప్రశ్నించారు. ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు? ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకంటూ ఎమోషనల్ అయ్యారు. శాసనసభలో సంఖ్యా బలం పెంచుకోవడం కోసం ఏకపక్షంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామని చెబుతున్నారని ధ్వజమెత్తారు. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed