బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌పై MLC బల్మూరి వెంకట్ సీరియస్

by GSrikanth |
బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌పై MLC బల్మూరి వెంకట్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. తమది ప్రజా ప్రభుత్వమని.. బీఆర్ఎస్‌లా కాదని అన్నారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియా కన్వీనర్‌గా ఉన్నానని చెప్పి ఏదైనా మాట్లాడొచ్చని క్రిశాంత్ భావిస్తే కుదరదు అని అన్నారు. దమ్ముంటే ఆధారాలతో అమలవీరుల స్థూపం వద్దకు రావాలని సవాల్ చేశారు.

ప్రజల తీర్పును గౌరవించి ఇకనైనా తమపై బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు. కాగా, హైద‌రాబాద్ చిత్రపురి సొసైటీలో రూ.3 వేల కోట్ల భూదందాకు పాల్పడిన అనుముల మ‌హానంద రెడ్డికి త‌న‌కు ఏం సంబంధం లేద‌ని రేవంత్ రెడ్డి నిరూపించ‌గ‌ల‌రా..? అని బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ మ‌న్నె క్రిశాంక్ స‌వాల్ విసిరారు. భూదందాకు సంబంధించిన పోస్టు పెట్టినందుకు మ‌న్నె క్రిశాంక్‌పై మాదాపూర్ పోలీసులు నిన్న కేసు న‌మోదు చేసి, ఆయ‌న ఫోన్‌ను సీజ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed