- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన కాంగ్రెస్ MLA యెన్నం
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యన్నెం శ్రీనివాస్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మాకు లీగల్ నోటీసులు పంపారు. కేటీఆర్‌కు లా, అడ్మినిస్ట్రేషన్‌పై పరిజ్ఞానం లేదు. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వార్ రూమ్‌లు ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశారని మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. మీడియాలో వచ్చిన వార్తలను చూసి విచారణ చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేశాను. నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందేమో అనే అనుమానంతో ఫిర్యాదు చేశాను. ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్‌లో కూర్చొని పరిపాలన చేశారని క్లియర్‌గా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అధికారులు సస్పెండ్ అయ్యారు. అయినా లీగల్ నోటీసులు పంపి కేటీఆర్ తమను బెదిరించాలని చూస్తున్నాడు. టాస్క్ పోర్క్ వాహనాలలో డబ్బులు చేరవేశామని రిమాండ్‌లో ఉన్న పోలీసు అధికారులు చెప్పారు. ఇందిరాగాంధీ అఫీషియల్‌గా వాహనాలు వాడుకుందని, అలహాబాద్ కోర్టు అనర్హత వేటు వేసింది.
దీని ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ అనర్హులే. రేవంత్ రెడ్డి రూ.2500 కోట్లు ఢిల్లీకి పంపించారని మాట్లాడిన మీకు మేము కూడా లీగల్ నోటీసులు ఇవ్వాలి. మునుగులోడు బై పోల్‌లో సర్వే ఎజెంట్లను కిడ్నాప్ చేశారు. వాళ్ళ ఎమ్మెల్యేల కదలికలపై ట్యాపింగ్ చేశారు. హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని మీడియా కథనాలలో వచ్చాయి. ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయడం చరిత్రలో లేదు. ఫోన్ ట్యాపింగ్‌లు అన్ని ప్రగతి భవన్ వేదికగా జరిగాయి. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని ఒప్పుకున్నారు. డీజీపీకి తెలియకుండా స్పెషల్ టీం ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశారు’ అని ఎమ్మెల్యే యెన్నం వ్యాఖ్యానించారు.