- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్వరలోనే బండారాన్ని బయటపెడతా: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎట్టకేలకు తన కుమారుడి వ్యవహారంపై గొంతు విప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన శనివారం మీడియాతో చిట్‌చాట్ చేస్తూ, రెండు నెలలుగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఈ సమయంలో రాఘవపై కుట్రలు పన్ని అమలుచేశారని ఆరోపించారు. స్వంత పార్టీ నేతలూ, విపక్షాల నేతలూ కుమ్మక్కై ఈ కుట్రలకు పాల్పడ్డారని అన్నారు. త్వరలోనే కుట్రలను బైటపెడతానని, బండారాన్ని వెల్లడిస్తానని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడయ్యే పరిస్థితి ఉన్నదని, కానీ ఈ వ్యవహారంతో రాఘవ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థమైందన్నారు. తాను అనారోగ్యం పాలుకాకుండా ఉన్నట్లయితే తన కుమారుడికి ఈ దుర్భర పరిస్థితి వచ్చేది కాదన్నారు.
ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నానని, నియోజకవర్గంలో తిరుగుతున్నానని, త్వరలోనే రాఘవపై కుట్రకు పాల్పడినవారి బండారాన్ని బైటపెడతానని అన్నారు. కుట్రలు చేసిన వారి సంగతి తేలుస్తానన్నారు. రాజకీయ కుట్రలు చూసిన తర్వాత రాఘవపై ప్రజల్లో సానుభూతి పెరిగిందన్నారు. ఆయనపై పెట్టిన కేసు కూడా నిలవదన్నారు.