- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మళ్ళీ మైక్ ముందుకు వస్తే జనం ఛీ కొడతారనే.. ప్రధాని మోడీపై సీతక్క వ్యంగ్యాస్త్రం
దిశ, డైనమిక్ బ్యూరో: రూ.2 వేల నోట్ల రద్దు చేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ తీసుకున్న సడెన్ డిసిషన్‌ను కొన్ని పార్టీలు సమర్ధిస్తుంటే.. మరి కొంత మంది విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకోవాలన్న ఆర్బీఐ ప్రకటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రియాక్ట్ అయ్యారు. 'మళ్ళీ మైక్ ముందుకు వచ్చి చెప్తే.. జనం ఛీ కొడతారని.. ఆర్బీఐతో కానిచ్చేశాడు' అంటూ ప్రధాని మోడీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గతంలో 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో నోట్ల రద్దు విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ టీవీల్లో లైవ్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈసారి రూ.2 వేల నోటు వెనక్కి తీసుకునే విషయాన్ని ప్రధాని కాకుండా ఆర్బీఐ ప్రకటించింది. అయితే గతంలో నోట్ల రద్దును మోడీ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అలా ప్రకటన చేసే అధికారం ప్రధానికి లేదని ఆర్బీఐ చేయాల్సిన ప్రకటనను ప్రధాని ఎలా చేస్తారంటూ కోర్టుకు వెళ్లిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈసారి అటువంటి చిక్కులేమి ఉండకుండా ఆర్బీఐ ద్వారానే ప్రభుత్వం ప్రకటన చేయించిందనే వాదన వినిపిస్తోంది.