ఒక్క చాన్స్ ప్లీజ్.. ఢిల్లీలో ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-06-26 16:17:27.0  )
ఒక్క చాన్స్ ప్లీజ్.. ఢిల్లీలో ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సోమవారం సీతక్క భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్లే కానీ.. పోయే వారు ఎవరు లేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎవరూ లేరని సీతక్క తెలిపారు. పార్టీలో నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు సహజం అని.. కానీ ప్రజల కోసం వాటన్నింటిని పక్కన పెట్టి ఐక్యంగా పని చేస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని.. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని సీతక్క దీమా వ్యక్తం చేశారు. ఇక పొంగులేటి, జూపల్లి చేరికలపై స్పందిస్తూ.. జూపల్లి, పొంగులేటి, వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో రాహుల్ గాంధీ హ్యాపీగా ఫీలయ్యారని చెప్పారు.

ఇవి కూడా చదవండి : రేపు అన్ని బయటపెడతా.. చేరికల వేళ MP ఉత్తమ్ హాట్ కామెంట్స్

Advertisement

Next Story