- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఏం రా కేసీఆర్.. ఏం మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావ్’.. ఎమ్మెల్యే రేఖానాయక్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేఖానాయక్ మాట్లాడుతూ.. ‘ఏం రా కేసీఆర్.. ఏం మొఖం పెట్టుకుని ఖానాపూర్‌లో ఓట్లు అడుగుతావ్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కేటీఆర్.. నీ ఫ్రెండ్ జాన్సన్ నాయక్ గెలుస్తాడని ఎలా చెబుతావ్..? నీ చెంచాలు, గ్లాసులు ఎత్తేవాళ్లకు ఖానాపూర్‌లో ఓట్లు ఎలా వేస్తాం’’ అని మండిపడ్డారు. అసలు కేసీఆర్‌కు బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. కాగా, ఖానాపూర్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు బీఆర్ఎస్ నిరాకరించిన విషయం తెలిసిందే.
ఖానాపూర్‌లో రేఖానాయక్‌ను పక్కన పెట్టిన బీఆర్ఎస్.. మంత్రి కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇచ్చింది. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన రేఖానాయక్ బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికీ చేరారు. కాంగ్రెస్ సైతం ఆమెకు ఖానాపూర్ టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. ఖానాపూర్ కాంగ్రెస్ టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం మాత్రం వెడ్మ బొజ్జుకు అవకాశం ఇచ్చింది. ఇదిలా ఉంటే, రేఖానాయక్ సీఎం కేసీఆర్‌ను ‘ఏం రా’ అని విమర్శించడంతో ఆమెపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గౌరవప్రదమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని ‘ఏం రా’ సంబోధించడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుముంటున్నారు.