- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLA Ranga Reddy: పడిపోయిన బీఆర్ఎస్‌ను లేపేందుకు బీజేపీ స్కెచ్.. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ (BRS) పార్టీని తిరిగి లేపేందుకు బీజేపీ (BJP) భారీ స్కెచ్ వేసిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Ranga Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ (BJP) నేతలది మూసీ నిద్ర కాదు.. ఏసీ గదుల్లో నిద్ర అని కామెంట్ చేశారు. మూసీ ఒడ్డున నిద్ర చేయమంటే.. వాళ్లు ఏసీ గదుల్లో నిద్రించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాధరణ కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ (BRS Party)ని లేపేందుకే బీజేపీ (BJP) స్కెచ్ వేసిందని ఆరోపించారు.
కేటీఆర్ (KTR) ఢిల్లీ (Delhi)కి వెళ్లినప్పుడల్లా కిషన్‌రెడ్డే (Kishan Reddy) అపాయింట్‌మెంట్ ఇప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు. మూసీ(Musi)పై ప్రజల ముందు బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. బుల్డోజర్లకు అడ్డొచ్చే ధైర్యం బీజేపీ (BJP) వాళ్లకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎంతమంది అడ్డొచ్చినా.. మూసీ పునరుజ్జీవం (Mousse Renaissance) ఆగదని అన్నారు. పేదల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి అడ్డుపడితే ఆ ప్రజల ఉసురు బీజేపీ (BJP)), బీఆర్ఎస్ (BRS) పార్టీలకు తగులుతుందని మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు.