తెలంగాణ రాష్ట్రానికి హైడ్రా అవసరం.. రంగనాథ్‌కు అత్యుత్సాహం ఎక్కువ: ఎమ్మెల్యే కూనంనేని

by Mahesh |
తెలంగాణ రాష్ట్రానికి హైడ్రా అవసరం.. రంగనాథ్‌కు అత్యుత్సాహం ఎక్కువ: ఎమ్మెల్యే కూనంనేని
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలు చేసి అక్రమంగా భవనాలు నిర్మించిన వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. అక్రమంగా కట్టిన బిల్డింగ్ ఎవరిదనే విషయం పక్కనపెట్టి.. కూల్చివేతలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రాను తమ జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు సీఎంకు లేఖ రాస్తున్నాను. కాగా ఈ హైడ్రా దూకుడుపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ స్పందించారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రా తెలంగాణ రాష్ట్రానికి అవసరం అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా అంటే ఒక భయానకమైన పేరు అని.. దాని పేరు వింటేనే పలురువు భయపడిపోతున్నారని.. అలాంటి పేరుతో ప్రభుత్వం రంగంలోకి దిగిందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఈ హైడ్రాను నిర్ధిష్టమైన ప్రణాళికతో ఉపయోగించకపోతే.. నిజంగానే డ్రాగన్ అవుతుందని అన్నారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురించి తనకు తెలుసని.. ఆయనకు అత్యుత్సాహం ఎక్కువ అని అన్నారు. ఈ అత్యుత్సాహం తో కొన్ని సార్లు ఇబ్బంది కలుగుతుందని.. సామన్యుల ఇళ్లను కలుస్తున్నారని.. పెద్దవాళ్ల విషయంలోనూ అలాగే వ్యవహరించాలని ఎమ్మెల్యే కూనంనేని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story