తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉరి వేసుకుంటా: MLA జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-06-16 13:36:10.0  )
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉరి వేసుకుంటా: MLA జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జోగు రామన్నను జోకుడు రామన్న అంటే బాగుంటుందని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. జోగు రామన్న ఓ చెల్లని రూపాయని.. అందుకే కేసీఆర్ రెండవ సారి ఆయనకు మంత్రిగా అవకాశం ఇవ్వలేదని రేవంత్ ఘాటు విమర్శలు చేశారు. కాగా, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాజాగా ఎమ్మెల్యే జోగు రామన్న ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి దీటుగా అదే రేంజ్‌లో జోగు రామన్న విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసులో పట్టపగలే అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.

గతంలో చంద్రబాబును.. ఇప్పుడు రాహుల్ గాంధీని జోకిన చరిత్ర నీదని ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన తనను రేవంత్ రెడ్డి అవమానించాడని.. బలహీన వర్గాలకు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా జోగు రామన్న డిమాండ్ చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌పై, బీఆర్ఎస్‌ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరిస్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ఉరి వేసుకుంటానని.. అదే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటావా అని జోగు రామన్న సవాల్ విసిరారు.

Advertisement

Next Story