- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్‌కి నీటిని పంపు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కోరారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. గత మూడేళ్లుగా సిద్దిపేట జిల్లాలో సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందజేశామన్నారు. దీంతో పంట దిగుబడి పెరిగి రైతుల బతుకుల్లో సంతోషం నిండిందన్నారు.
ఈ యేడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్‌లో లేక రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. యాసంగికి నీళ్లు అందించాలంటే 3 టీఎంసీల నీరు ఉండాలని, కానీ, ప్రస్తుతం రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో నీరు తక్కువగా ఉందన్నారు. రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వెంటనే మిడ్ మానేరు నుంచి 1.50 టీఎంసీల నీళ్లు రంగనాయక సాగర్‌కు వచ్చే విధంగా పంపింగ్ చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాలని కోరారు.