- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇలా ఎప్పుడైనా జరిగిందా?: హరీష్ రావు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. శనివారం భద్రాచలం నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. రెండ్రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని గొప్పలు చెబుకుంటున్న కాంగ్రెస్ మంత్రులు.. ఇప్పుడు రెండు నెలలు కావొస్తున్నా మిగిలిన వాటి గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ఎనాడూ ఇంత ఆలస్యంగా జమ కాలేదని విమర్శించారు. ఫిబ్రవరి వచ్చినా రైతుబంధు వేయకపోవడమే మార్పా? అని అడిగారు. పాలన చేతకాక తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతుల్లో పెట్టిందని ఎద్దేవా చేశారు.
అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి ఇప్పుడు బీఆర్ఎస్‌పై నిందలు వేస్తున్నారని అన్నారు. తిట్ల పురాణమే తెలంగాణ పునర్:నిర్మాణంగా తయారైందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆలస్యమైందని.. ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు భద్రాద్రి రాముడిని హరీష్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనం తర్వాత వేద పండితులు శాలువాతో సత్కరించారు. హరీష్ రావు వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉన్నారు.