- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS లిస్ట్‌లో సగం మంది ఓడిపోవడం ఖాయం: ఈటల కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్‌ను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించారు. కాగా, ఈ జాబితాపై బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీకి భయపడే అభ్యర్థుల లిస్ట్‌ను కేసీఆర్ ముందే ప్రకటించారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రటించిన లిస్ట్‌లో ఉన్న సగం మంది ఓడిపోవడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కేసీఆర్ రెండు చోట్ల నుండి పోటీ చేయడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్నాడన్నారు.
ఇక, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. గెలుపు లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉండగానే సీఎం కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కంటే ముందే క్యాండిడేట్ల లిస్ట్‌ను ప్రకటించిం.. సీఎం కేసీఆర్ ఎన్నికల కసరత్తును స్పీడప్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో.. కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ఎప్పడు ప్రకటిస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.