కొప్పుల ఈశ్వర్‌పై ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సీరియస్

by Anjali |
కొప్పుల ఈశ్వర్‌పై ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొప్పుల ఈశ్వర్ దీక్షపై మండిపడ్డారు. ఆదివారం పెగడపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశమై ఆయన మీడియాలో మాట్లాడారు. దొంగ దీక్ష, దొంగ ప్రేమలు చూపిస్తారని అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మంత్రిగా ప్రభుత్వ విప్‌గా ఉన్నప్పుడు కొప్పుల ఈశ్వర్ రైతులను పట్టించుకోలేదని మండిపడ్డారు. రేపటి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజల్ని కోరారు. కాగా, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్ని్కయ్యారు.

Advertisement

Next Story

Most Viewed