- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐకేపీ సెంటర్ వద్ద బీఆర్ఎస్ నాయకుల నిరసన..
దిశ, తుంగతుర్తి : ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి వెంటనే దాన్ని సంబంధిత మిల్లులకు అలాట్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఐకేపీ సెంటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నేతలు శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక కష్టాలు పడి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తే వెంట వెంటనే కొనుగోలు చేయకపోవడం వల్ల వర్షాలతో తడిసి ముద్దవుతుందని అన్నారు. ముఖ్యంగా సన్న, దొడ్డు ధాన్యాలకు వేరు వేరు చోట్ల కేంద్రాలు ప్రారంభించడం రైతాంగానికి తలనొప్పిగా మారిందన్నారు.
అన్ని రకాల ధాన్యానికి క్వింటాలు ఒక్కింటికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్, మండల నాయకులు బెడద రాములు, మట్టిపెల్లి వెంకట్, కడారి దాసు సోమశేఖర్, ప్రవీణ్, బింగి సోమయ్య, ఇసాకర్, తదితరులు పాల్గొన్నారు.