- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : శిబిరాలతో జీవన నైపుణ్యాలు మెరుగు
దిశ, దమ్మపేట : జాతీయ సేవా పథకం, ప్రత్యేక శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులకు జీవన నైపుణ్యాలు పెరుగుతాయని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం రైతు వేదికలో అశ్వారావుపేట ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో మల్లారం గ్రామంలో ఏడు రోజుల పాటు జరిగే జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ఎన్ఎస్ఎస్ జెండా ఆవిష్కరించి, వ్యవసాయ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అందులో ఏర్పాటు చేసిన చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడే సమగ్ర వ్యవసాయం, పుట్టగొడుగుల పెంపకం, నీటి యాజమాన్యం, అంతర పంటల సాగు, ట్రైకోడెర్మా, సుడోమోనాస్ తయారీ వాటి ఉపయోగాల గురించి విద్యార్థుల ద్వారా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రైతులతో కలిసి తెలుసుకున్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వారం రోజులపాటు జరిగే జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాల్లో విద్యార్థులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రోజుకొక అంశం మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి విద్యార్థులు గ్రామస్తులతో మమేకం కావాలని, వారి స్థితిగతులు తెలుసుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. విద్యార్థులు గ్రామస్తులకు చెట్ల పెంపకం, సేంద్రియ వ్యవసాయం, బయో ఫెర్టిలైజర్స్, ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్, జిల్లా వ్యవసాయ సహాయక డైరెక్టర్ రవికుమార్, మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, ఎన్ఎస్ఎస్ బృందం డాక్టర్లు రాంప్రసాద్ రెడ్డి, ప్రియ, శ్రవణ్ కుమార్, ఏఈఓ దీప్తి, చైర్మన్ రాఘవరావు, కోటగిరి సత్యం బాబు, గోపి శాస్త్రి పాల్గొన్నారు.