Uttam Kumar Reddy: వాటి తర్వాతే కొత్త రేషన్ కార్డులు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Prasad Jukanti |   ( Updated:2024-11-11 06:35:37.0  )
Uttam Kumar Reddy: వాటి తర్వాతే కొత్త రేషన్ కార్డులు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: లక్షలాది మంది ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డు(New Ration Cards) లపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన, ధాన్యం సేకరణ పూర్తయ్యాక తెల్లరేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తాజాగా ఓ మీడియా చానల్ తో మాట్లాడిన ఉత్తమ్.. గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్ల సివిల్ సప్లై శాఖ నిర్వీర్యం అయిందని ధ్వజమెత్తారు. మేము అధికారంలోకి వచ్చాక ఈ శాఖలో రూ.55 వేల కోట్ల అప్పుని రూ.11 వేల కోట్లకు తగ్గించామన్నారు. ధాన్యం సేకరణ (Grain Collection) విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారని, ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారులతో పర్యావేక్షన పెట్టామన్నారు. ఏ కొనుగోలు కేంద్రంలోనైనా ధాన్యం సక్రమంగా కొనుగోలు చేయకపోతే వెంటనే తాము జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.

బీఆర్ఎస్ (Brs) పాలనలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశాక రెండు నెలలైనా ధాన్యం డబ్బులు పడలేదన్నారు. ప్రస్తుతం మేము ధాన్యం సేకరించిన రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. కొన్ని చోట్ల మిల్లర్లు సహాయనిరాకరణ చేస్తున్నారని.. మరి కొన్ని చోట్ల జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. మిల్లర్లు కొనుగోలు చేయకుంటే స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ ద్వారా 30 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ స్పేస్ ను సిద్ధం చేసుకున్నామన్నారు. మిల్లర్లు కొనుగోలు చేయకుంటే ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు.

బీఆర్ఎస్ రాజకీయ అవసరాల కోసం ఏమైనా మాట్లాడుతుండవచ్చని కానీ సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ గతంలో కంటే ప్రస్తుతం చాలా మెరుగ్గా పని చేస్తున్నదన్నారు. మూసీపై బీఆర్ఎస్ కావాలనే రాద్ధాంతం చేస్తున్నదని, మూసీ పునరుజ్జీవాన్ని నల్గొండ ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా మేమంతా ఓ టీమ్ గా సమిష్టిగా ముందుకు వెళ్తున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు స్టడీ చేశాకే వర్గీకరణపై సబ్ కమిటీ ఏర్పాటు అయిందని, వర్గీకరణపై వన్ మెన్ జ్యుడిషియల్ కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ విషంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed