రేపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్న మంత్రి ఉత్తమ్‌

by Anjali |
రేపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్న మంత్రి ఉత్తమ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు మధ్యాహ్నం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. ఉత్తమ్ తో పాటు ఇరిగేషన్‌ ఈఎన్సి అనిల్‌కుమార్‌, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు వెళ్లి.. NDSA మధ్యంతర నివేదిక సూచనల మేరకు కొనసాగుతున్న పనుల పురోగతి పరిశీలించనున్నారు. రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరదల నేపథ్యంలో చేపడుతున్న రక్షణ పనులను సమీక్షించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులను చేపట్టిన ఎల్‌ అండ్‌ టీ, ఆఫ్‌కాన్స్‌, నవయుగ వర్క్ ఏజెన్సీలు, బ్యారేజీల మరమ్మతులు, వర్క్ ఏజన్సీలు చేపట్టిన పనులు, ప్రస్తుత బ్యారేజీల పరిస్థితిని నిర్మాణ సంస్థల టాప్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతినిధులు మంత్రికి వివరించనున్నారు. బ్యారేజి పరిస్థితి, వాటి మరమ్మతుల ప్రోగ్రెస్ గురించి రేపు మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. చాపర్ ద్వారా సుందిల్లకు చేరుకొని మధ్యాహ్నం 1 గంటల వరకు సుందిల్ల బ్యారెజీని పరిశీలించనున్నారు. అనంతరం అన్నారం చేరుకొని బ్యారేజి పరిశీలన, అక్కడి నుండి మేడిగడ్డ బ్యారేజికి వెళ్లనున్నారు.

Advertisement

Next Story