Uttam Kumar Reddy : సీతారామ ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh N |   ( Updated:2024-08-15 16:15:13.0  )
Uttam Kumar Reddy : సీతారామ ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సీతారామ ప్రాజెక్టు మూడు పంప్ హౌస్‌లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చిన ఘటన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని హర్షం వ్యక్తంచేశారు. సీడబ్ల్యూసీ అప్రూవల్ మరో పది రోజుల్లో రానున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం రూ.1.81లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా సాగునీళ్లు ఇవ్వడంలో విఫలం అయ్యిందని ఆయన ఫైర్ అయ్యారు. నాగార్జున సాగర్ నీళ్లు రాని సమయంలో రాజీవ్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్లతో ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని స్పష్టం చేశారు. కాగా,

ఇవాళ సీతారామ ప్రాజెక్టు మూడు పంప్ హౌస్‌లను సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. మొదటి పంప్‌హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించగా, ములకలపల్లి మండలం కమలాపురం వద్ద మూడో పంప్‌ హౌస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అదేవిధంగా పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్‌ హౌస్‌ను సీఎం రేవంత్ స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు సహా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed