రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు లక్షల రుణమాఫీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ -2 ట్రయల్ రన్‌ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్ పాల్గొని మాట్లాడారు. ఈనెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని చెప్పారు.

అదే రోజు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని అన్నారు. ఈ నెలాఖరులో గోదావరికి కృష్ణా జలాల నుంచి 65 టీఎంసీలు కేటాయిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులకు రూ.లక్షా 81 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరం కూడా సాగులోకి రాలేదని విమర్శించారు. 2026లో ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి జలాలు అందిస్తామని అన్నారు. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ద్వారా లక్షా 52 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. పాలేరు లింక్ కెనాల్‌కు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. పాలేరు, నాగార్జునసాగర్‌ కింద భూములకు నీరందుతుందని అన్నారు. భద్రాచలం, ఇల్లందుకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story