Tummala Nageswara Rao: రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
Tummala Nageswara Rao: రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీ(Rythu Runa Mafi)పై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరిధాన్యం కొనుగోలుకు మిల్లర్లతో మాట్లాడి మిల్లింగ్ ఛార్జీలు పెంచామని తెలిపారు. ఇప్పటి వరకు 22 లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేశాం.. నల్గొండ(Nalgonda) జిల్లాలోనే అధికంగా రుణమాఫీ(Runa Mafi) జరిగిందని చెప్పారు. డిసెంబర్‌ 9లోపు పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత(Handloom) ద్వారా మహిళలకు చీరలు అందిస్తామని ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న చేనేత నిధులను త్వరలో మంజూరు చేస్తామని అన్నారు. చేనేత వృత్తిదారుల అప్పులను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. అంతేకాదు.. పెండింగులో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed