- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీజీ.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?:మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దిశ, వెబ్ డెస్క్: మోడీజీ.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. ఉద్యోగాల పేరుతో పీఎం మోడీ దేశంలోని నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించిందని, ఈ కేసుకు సంబంధించి అనేక మందిని అరెస్ట్ చేశామని అన్నారు. బీజేపీ నేతలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇక తెలంగాణతో తమకు ఏమాత్రం సంబంధం లేనట్టుగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని, అసలు తెలంగాణ భూభాగం దేశంలో భాగమనే విషయాన్ని ప్రధాని మోడీ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడంలేదని అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సింగరేణి విషయంలో మోడీ మాట ఇచ్చి తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చాలా సింపుల్ గా ఉంటారన్న ఆయన.. మోడీ లాగా ఖరీదైన దుస్తులు వేసుకోవడం కేసీఆర్ కు చేతకాదు అని ఎద్దేవా చేశారు.