MP ఈటలకు అందని ఆహ్వానం.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

by Gantepaka Srikanth |
MP ఈటలకు అందని ఆహ్వానం.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోము అని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) వార్నింగ్ ఇచ్చారు. మూసీ అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు తాము సిద్ధమని అన్నారు. యుద్ధం చేయడానికి కూడా తాము సిద్ధమే అని.. కానీ నాలుగేళ్ల తర్వాత చేద్దామని సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్యక్రమానికి ఈటల రాజేందర్‌కు ఆహ్వానం అందలేదంటే తప్పకుండా సమీక్షిస్తామని అన్నారు. ప్రొటోకాల్ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని అన్నారు.

తాను వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్‌లు తనకు మిత్రులు అని అన్నారు. కానీ, రాజకీయ అభిప్రాయాలు వేరు.. స్నేహం వేరని వెల్లడించారు. హైడ్రా ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించిందని గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతేకాదు.. హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంటర్నేషన్ సంస్థ మెరియట్ ముందుకు వచ్చిందని చెప్పారు. హాస్పిటాలిటీకి చెందిన మేరియట్ సంస్థ.. దేశంలోనే మొదటి గ్లోబర్ కేపబిలిటీ సెంటర్ (GCC) ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి సిద్ధమైందని అన్నారు.

Next Story