- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ వర్సెస్ సీతక్క.. అసెంబ్లీలో ఉద్యోగాలపై మాటల యుద్ధం
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదన్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంటింటికీ ఉద్యోగం పేరుతో బీఆర్ఎస్ పదేళ్లు ప్రజలను మోసం చేసిందని.. ఉద్యోగాలు ఇవ్వక కేసీఆర్ పదేళ్లు ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లలేని పరిస్థితి కొనితెచ్చుకున్నారని అన్నారు. గడిచిన పదేళ్లలో కేటీఆర్ ఓయూకి ఎప్పుడైనా వెళ్లారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు ఆశ చూపించారు. ఎన్నికల తర్వాత మళ్లీ దాని గురించే మాట్లాడరని విమర్శించారు.
రాష్ట్రంలో లక్షల మంది పేదలు ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి ఇళ్లు ఇచ్చిందని ప్రశ్నించారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని మంత్రి సీతక్క మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు ఎవరికైనా సరే బుద్ధి చెబుతారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.