‘హర్యానాలో బీజేపీ గెలిస్తే.. బీఆర్ఎస్ సంబురం’ హరీశ్ రావుపై సీతక్క ఫైర్

by Ramesh N |   ( Updated:2024-10-09 11:04:52.0  )
‘హర్యానాలో బీజేపీ గెలిస్తే.. బీఆర్ఎస్ సంబురం’ హరీశ్ రావుపై సీతక్క ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానాలో బిజెపి విజయంతో ఇక్కడ brs సంబురపడటం చూస్తే ఆ రెండు పార్టీలు ఒకటే అని మరో సారి రుజువయ్యిందని మంత్రి సీతక్క విమర్శించారు. ఈ మేరకు ఆమె తాజాగా మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత హ‌రీష్ రావు ది గురువింద నీతి అని మండిపడ్డారు. మీరు ప‌దేళ్లలో చేయ‌లేని రుణ మాఫీ మేము ఒకే పంట‌ కాలంలో చేశామని తెలిపారు. మీక‌న్నా ల‌క్ష‌న్న‌ర మంది రైతుల‌కు అద‌నంగా ఇప్ప‌టికే రుణ మాఫీ చేశామని చెప్పుకొచ్చారు. మాది నిజయితి గల్ల ప్రభుత్వం.. అర్హులైన ప్ర‌తి రైతుకు రుణ మాఫి చేస్తామని హామీ ఇచ్చారు.

పాల‌కుర్తి స‌భ‌లో సన్న‌వ‌డ్ల‌కు బోన‌స్ ఇస్తామ‌ని కేసీఆర్ హ‌మీ ఇచ్చి వంచించారని గుర్తుచేశారు. తొర్రూర్ స‌భ‌లో మీరు బోన‌స్ గురించి మీరు ప్ర‌శ్నించ‌డం విడ్డూరమన్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు విద్యార్ధిని లావ‌ణ్య ఆక్రంద‌న మీకు వినిపించ‌లేదా? అని ప్రశ్నించారు. ఫీ రియంబ‌ర్స్ మెంట్ పై మీది క‌ప‌ట ప్రేమ‌ అని, మాజీ మంత్రి హ‌రీశ్ రావుపై మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story