- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sridhar Babu : బీఆర్ఎస్ రెండుసార్లు ఫ్లాప్.. పర్యటన ముగిసిన తర్వాత శ్రీధర్ బాబు ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: మా పర్యటనలపై బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోందని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ఫైర్ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా , దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, బృందం తిరిగి బుధవారం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. తమ పర్యటన ఫ్లాప్ అయిందో, సక్సెస్ అయిందో ప్రజలకు తెలుసున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎవరు ఫ్లాప్ అయ్యారో తెలిసి పోయిందన్నారు. బీఆర్ఎస్ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ రెండుసార్లు ఫ్లాప్ అయ్యిందని, అయినా బుద్ధి రాలేదని, ఇలాగే మాట్లాడితే మరోసారి ఫ్లాప్ అవ్వడం ఖాయమని విమర్శించారు.
అనేక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయని వెల్లడించారు. విదేశీ కంపెనీలు స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను అభినందించాయని అన్నారు. ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణ ఉండబోతుందని, మన రాష్ట్ర ఆలోచనను విదేశీ ప్రతినిధులకు చెప్పామని పేర్కొన్నారు. తమ పర్యటనలో నిమిషం కూడా వృధా చేయకుండా సమయాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం వినియోగించామని పేర్కొన్నారు.