- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలను కించపరచడం కేటీఆర్‌కు ఫ్యాషన్ అయిందంటూ.. మంత్రి సీతక్క ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై తెలంగాణ మంత్రి సీతక్క(Minister Seethakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించపరిచారని, మహిళలను కించపరచడం కేటీఆర్‌కు ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజు మహిళా మంత్రులను కించపరిచి కేటీఆర్ తన నైజం చాటుకున్నాడని, పండగ రోజు కేటీఆర్ నోట ఇలాంటి మాటలు వినాల్సి రావడం మన దురదృష్టకరమన్నారు. పండగ పూట.. మహిళల పట్ల చీప్ కామెంట్స్ చేసే కేటీఆర్ నోరును యాసిడ్‌తో కడగాలన్నారు. చిట్ చాట్ పేరుతో మా గురించి చులకనగా మాట్లాడారని, అదే విషయం మీడియా ముఖంగా చెప్పి ఉంటే మహిళలే కేటీఆర్‌కు తగిన బుద్ధి చెప్పేవారని అన్నారు. మహిళా మంత్రులను పదే పదె కించపరుస్తూ తన దొర దురహంకారాన్ని కేటీఆర్ చాటుకుంటున్నాడని, చాటుమాటుగా నాలుగు గోడల మధ్య మాట్లాడటం కాదు.. ధైర్యముంటే బహిరంగంగా మాట్లాడాలని మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు.