Minister Seethakka: మహిళా కమిషన్‌ను మేమూ కలుస్తాం..

by Gantepaka Srikanth |
Minister Seethakka: మహిళా కమిషన్‌ను మేమూ కలుస్తాం..
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలను అవమానించే తీరులో చులకన చేస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మరోసారి ఘాటుగానే స్పందించారు. ఒకవైపు యధాలాపంగా మాట్లాడానని, మహిళల మనసు బాధపడితే వెనక్కి తీసుకుంటున్నానని చెప్తూనే తన పార్టీ అనుచరులతో, ఎమ్మెల్యేలతో ఇప్పటికీ తిట్టిస్తూనే ఉన్నారని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై నేరాలు పెరిగిపోయాయంటూ బీఆర్ఎస్ నేతలు తరచూ విమర్శలు చేస్తున్నారని, కానీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తొమ్మిదేండ్ల కాలంలో (2022 వరకు) మొత్తం 1,57,610 కేసులు నమోదయ్యాయని ఆమె వివరించారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో ఈ గణాంకాలను వెల్లడించిందని, ఇవన్నీ మహిళలపై జరిగిన నేరాలను పోలీసులు కేసులుగా నమోదు చేసినవేనని అన్నారు.

మహిళా కమిషన్‌ను తాము కూడా కలుస్తామని, గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన నేరాలన్నింటినీ సమర్పిస్తామని సీతక్క అన్నారు. సీఎల్పీ సమావేశం అనంతరం బైటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, మహిళా కమిషన్‌ను కలిసి కాంగ్రెస్ పాలనలో ఎనిమిది నెలల్లో జరిగిన నేరాలపై మెమోరాండం ఇస్తామంటూ కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారని, తొమ్మిదేండ్ల ఆ పార్టీ పాలనలో జరిగిన నేరాల వివరాలను కూడా ఇవ్వాలని ఆమె సూచించారు. ఆ వివరాలను ఆయనకు తెలియజేయడానికే ఇప్పుడు మీడియా ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలోని నేరాలను, తొమ్మిదేండ్ల పాటు మంత్రిగా ఉన్న కేటీఆర్ వారి తండ్రి కేసీఆర్ పాలనలో చోటుచేసుకున్న నేరాల వివరాలను కూడా కమిషన్‌కు వివరిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఏటేటా ఈ కేసులు పెరుగుతూనే ఉన్నాయని ఆమె గుర్తుచేశారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాలు, వాటిపై పోలీసులు నమోదు చేసిన కేసులు...

Advertisement

Next Story

Most Viewed