- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది ఆలివ్ గ్రీన్ కాదు.. ''వారాహి'' వాహన రంగుపై మంత్రి పువ్వాడ క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథం ''వారాహి'' వాహన వివాదంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. పవన్ వారాహి వాహనంపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. రవాణా శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు వారాహి వాహనానికి ఉన్నాయని అన్నారు. వారం రోజుల క్రితమే వారాహి వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైందని మంత్రి వెల్లడించారు. అన్ని నిబంధనలకు లోబడే వారాహి వాహన రంగు ఉందని.. అందరూ అంటున్నట్లుగా వారాహి వాహనం రంగు ఆలివ్ గ్రీన్ కాదని.. అది ఎమర్డాల్ గ్రీన్ అని కలర్‌పై క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా పవన్ వారాహి వాహనం కలర్‌పై వివాదం నడుస్తోంది. పవన్ ఎన్నికల ప్రచారం కోసం రెడీ చేయించిన వాహనానికి డిఫెన్స్ వెహికల్స్‌కు వాడే కలర్ వాడాడని.. ఇది చట్ట విరుద్ధం అంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ వారాహి వాహన కలర్‌పై ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చిన్నపాటి యుద్ధమే సాగింది. జనసేన, వైసీపీ కార్యకర్తలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. పవన్ కల్యాణ్ సైతం వారాహి వాహన కలర్‌పై ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు. ఇలా రాజకీయ దుమారం రేపిన వారాహి వాహన రిజిస్ట్రేషన్ చివరకు తెలంగాణలో జరగడం గమనార్హం.