- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలోనే రూట్ మ్యాప్: మంత్రి పొన్నం ప్రభాకర్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ప్రతి మండలం నుండి జిల్లా కేంద్రానికి ఏసీ బస్సులు పెట్టేందుకు కసరత్తు జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీంతో పాటు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి హైదరాబాద్ వరకు ప్రత్యేకంగా ఏసీ సర్వీసులు నడిపేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని, ఈ మేరకు ఆర్టీసీ ఆఫీసర్లు అధ్యయనం చేస్తున్నారన్నారు. త్వరలోనే రూట్ మ్యాప్‌లు సిద్ధం కానున్నాయని స్పష్టం చేశారు. సోమవారం శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అవసరం మేరకు కొన్ని మండల కేంద్రాల నుంచి నేరుగా హైదరాబాద్‌కు ఏసీ బస్సులు తిప్పేందుకు కూడా కార్యచరణ రెడీ చేస్తామన్నారు. దీంతో పాటు ప్రతి రోజు రాత్రి 10 గంటలకు శ్రీశైలం టు హైదరాబాద్, హైదరాబాద్ టు శ్రీశైలంకు ఏసీ బస్సులు తిప్పుతామన్నారు. మరోవైపు చెప్పినట్టుగా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. ప్రస్తుతానికి లక్ష వరకు సాయం చేశామని, ఇప్పుడు లక్షా యాభై వేల వరకు రుణమాఫీ చేస్తున్నామన్నారు. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ పూర్తవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ఉన్నారని, వారిపై ఒత్తిడి తెస్తామన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు.