ఈ మహత్తర ఉద్యమంలో భాగస్వాములు కావాలి.. మంత్రి పొన్నం పిలుపు

by Gantepaka Srikanth |
ఈ మహత్తర ఉద్యమంలో భాగస్వాములు కావాలి.. మంత్రి పొన్నం పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యావరణ పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా హైడ్రాకు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. చెరువుల పరిరక్షణకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదని ఆయన వివరించారు. ప్రజలకు మంచి చేసే ఈ ఉద్యమంలో అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నదని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణకు గురైన చెరువులను కాపాడేందుకు హైడ్రాను తీసుకొచ్చామన్నారు.

దీని యాక్షన్ ప్లాన్ ముందుగా రాజధాని నగరంలో, ఆ తర్వాత జిల్లాల్లో విస్తరించనున్నదన్నారు. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల సమతుల్యత కోసం హైడ్రా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ లెక్కల్లోని చెరువుల రికార్డుల ప్రకారం డ్రైవ్ కొనసాగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల కబ్జాలపై సమాచారం ఇవ్వాలన్నారు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు ఇందుకోసం పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదన్నారు. హైదరాబాద్ ఒకప్పుడు లెక్ సిటీ గా ఉండేదని, క్రమంగా ఆక్రమణలు పెరిగిపోయాయన్నారు. 33 జిల్లాల్లో ఎక్కడ కబ్జాలు జరిగినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.

Advertisement

Next Story