‘సమస్య తీవ్రమైతే నేరుగా నా దృష్టికి తీసుకురావాలి’ అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ

by Anjali |
‘సమస్య తీవ్రమైతే నేరుగా నా దృష్టికి తీసుకురావాలి’ అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతుంది. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ‘తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఎ , వాటర్ వర్క్స్ , డీఆర్ఎఫ్ , ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, విద్యుత్ ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ఉండడం, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులకు అధికారులకు తెలపడం తెలిపాం.

హైదరాబాద్ లో భారీ వర్షం కురిసినప్పుడు నీళ్ళు నిల్వ ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఉండి నీళ్ళు వెంటనే వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. ఎక్కడైతే వర్షం కురిసి ఇబ్బందులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో అధికారులకు ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. సమస్య తీవ్రమైతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అధిక వర్షపాతం ఉన్న ప్రదేశాల్లో ప్రత్యెక చర్యలు తీసుకోవాలని ఇక్కడ జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి.

వర్షం కురిసిన సమయంలో లోతట్టు ప్రాంతాలు వారిని అప్రమత్తం చేయాలి. పాత భవనాల వద్ద ఉన్నవారిని ఖాళీ చేపించాలి. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వర్షాలు కురిసినపుడు విద్యుత్ స్థంబాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. పోలీస్, జీహెచ్ఎంసీ , హెచ్ఎండీఎ వివిధ విభాగాల అధికారులు ప్రజలు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పని చేయాలని ఆదేశించాం’. అని మంత్రి పొన్నం ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed