- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గణేష్ ఉత్సవ సమితీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా నగరంలో లక్షల సంఖ్యలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి నవరాత్రులు పూజలు చేస్తారు. యువత ఉత్సాహంగా నిర్వహించే ఈ చవితిపై మంత్రి పొన్నం ప్రభాకర్ హైద్రబాద్‌లో.. గణేష్ ఉత్సవాల నిర్వహణపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి.. GHMC, పోలీస్, వాటర్ వర్క్స్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారుల హాజరయ్యారు. వీరితో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహాల ప్రతిష్టాపన మొదలుకొని నిమజ్జనం వరకు ఎక్కడా సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేశారు. కాగా సెప్టెంబర్ 7న వినాయక చవితి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.