- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ponnam : డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పరిశీలించిన మంత్రి పొన్నం
దిశ, డైనమిక్ బ్యూరో: డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఇవాళ మలక్‌పేట నియోజకవర్గం సైదాబాద్ మండలంలోని పిల్లి గుడిసెలులో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పరిశీలించి, పెండింగ్ పనుల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంచల్‌గూడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంత్రి పొన్నం పరిశీలించారు. మంత్రితో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.
కాగా, రేవంత్ సర్కార్ త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు విధివిధానాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆ దిశగానే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్‌కు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రజా పాలనలో ఇంటి కోసం దాదాపు 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అర్భన్ పరిధిలో 23.5 లక్షలు, రూరల్‌లో 58.5 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.