- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ, బీఆర్ఎస్ ఓర్వలేక అడ్డుకున్నాయి.. రైతుబంధు ఆంక్షలపై పొన్నం రియాక్షన్
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో రైతుబంధు నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతులందరికీ రైతు భరోసా డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ లు ఓర్చుకోలేకపోతున్నాయని ధ్వజమెత్తారు. నిన్న ఒక్కరోజే 900 కోట్లు రైతుల ఖాతాలో నగదు జమ చేశామన్నారు. అందరికీ రైతు భరోసా విడుదల చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి అడ్డుకున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల ఫిర్యాదుతో లోక్ సభ ఎన్నికలు జరిగే వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది రైతుల పట్ల బీజేపీ, బీఆర్ఎస్ కు ఉన్న కపట ప్రేమ అని మండిపడ్డారు. ఈ విషయాన్ని రైతులంతా గమనించాలని లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లను నిలదీసి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాగా రైతు బంధు చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్.వేణు కుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఈసీ నిధుల విడుదలపై ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాతే పంపిణీ చేయాలని ఆదేశించింది.