‘ప్రజాపాలన’ దరఖాస్తుల గడుపు పొడిగింపుపై మంత్రి పొన్నం క్లారిటీ

by GSrikanth |
‘ప్రజాపాలన’ దరఖాస్తుల గడుపు పొడిగింపుపై మంత్రి పొన్నం క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా గడపక ముందే బీఆర్ఎస్ నేతలు ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. బీఆర్ఎస్‌, బీజేపీలు రెండూ ఒకటే అని చెప్పారు. కిషన్ రెడ్డి కేసీఆర్‌కు బినామీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను రక్షించేందుకే కిషన్ రెడ్డి సీబీఐ విచారన కోరుతున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ గడుపు పొడిగింపుపై క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 6వ తేదీ లోపే దరఖాస్తులు సమర్పించాలని కోరారు. గడుపు పొడిగింపు ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని వివరించారు. పవర్ ఎవరికీ పర్మనెంట్ కాదని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story