- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆయన మన ప్రాంతం వాడు కావడం మన అదృష్టం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి(Nelakondapally)లో నిర్వహించిన భక్త రామదాసు జయంతి ఉత్సవా(Ramadasu Jayanthi Celebrations)ల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భక్త రామదాసు మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టమని అన్నారు. నేలకొండపల్లిలో రామదాసు మందిరాన్ని అభివృద్ధి చేస్తా అని కీలక ప్రకటన చేశారు. కాగా, భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కూడా భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను వాగ్గేయకారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.య ఈ సందర్భంగా నిర్వహించిన భక్తి సంగీతం ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. భక్త రామదాసు ధ్యాన మందిరంలో ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. 3వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మూడు రోజులపాటు పలు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు.