- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్.. రైతుబంధుపై కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఐదు ఎకరాల వరకు రైతుబంధు నగదు రేపు జమ చేస్తామని ప్రకటించారు. గురువారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో పొంగులేటి చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. ధరణి అక్రమాలను వివరాలతో సహా బయటపెడతామని చెప్పారు. మేడిగడ్డ అవినీతిలో బాధ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
ధరణితో పాటు రిజిస్ట్రేషన్ శాఖను కూడా ప్రక్షాళన చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణికి సంబంధించి తన వద్ద మరింత సమాచారం ఉందన్నారు. అలాగే వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూస్తామని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణలో 14కు పైగా ఎంపీ సీట్లు ఈజీగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.