- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీ MLAల షాక్
దిశ, వెబ్ డెస్క్: మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. సోమవారం మంత్రి మల్లారెడ్డి వైఖరిపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో మేడ్చల్ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు పలు కీలక అంశాలపై ఎమ్మెల్యేలు చర్చించారు. మల్కాజ్ గిరి, ఉప్పల్‌లో పలు విషయాల్లో మంత్రి తలదూర్చడంపై మైనంపల్లి, భేతి సుభాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లికి సంబంధించి మార్కెట్ కమిటీ ఛైర్మన్ మార్పు విషయంలో స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా వేరే వ్యక్తికి అవకాశం కల్పించడం పట్ల ఎమ్మెల్యే వివేకానంద అసంతృప్తిల్లో ఉన్నట్లు సమాచారం. మంత్రి మల్లారెడ్డి తమకు సమాచారం ఇవ్వడం లేదని మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ గుస్సాగా ఉన్నట్లు తెలిసింది. మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు భేటీ కావడం సంచలనంగా మారింది. కాగా ఇటీవలే ఐటీ దాడులు ఎదుర్కున్న మల్లారెడ్డికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇదే అంశంపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్తే పరిస్థితి ఏంటని ఆయన ఆలోచలనో పడ్డట్లు సమచారం.
Also Read: బీఆర్ఎస్‌కు సవాలుగా మరో ఎన్నిక!