సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్‌గా మంత్రి మల్లారెడ్డి ఎంట్రీ

by GSrikanth |   ( Updated:2023-04-30 23:45:28.0  )
సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్‌గా మంత్రి మల్లారెడ్డి ఎంట్రీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన సచివాలయం ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా ప్రజాప్రతినిధులంతా సౌత్ ఈస్ట్ గేట్ నుంచి సచివాలయంలోకి కాన్వాయితో వెళ్లారు. కానీ, మల్లారెడ్డి మాత్రం తెలంగాణ తల్లి ప్లైఓవర్ నుంచి సచివాలయం వరకు నడకతో వచ్చారు. ప్రజలకు అభివాదం చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు చేతులు ఊపుతూ వచ్చారు. సచివాలయంలోకి తన అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. దీంతో ఆయన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం సింపుల్‌గానే వచ్చారు. సచివాలయం ఐదువందల మీటర్ల దూరంలో వాహనం ఆపి నడుచుకుంటూ సచివాలయంలోకి వెళ్లారు. అభివాదం చేసుకుంటూ వెళ్లడం అట్రాక్షన్‌గా నిలిచారు.

దండం పెట్టని సబిత, కేటీఆర్

సచివాలయంను సీఎం కేసీఆర్ ప్రారంభించిన తర్వాత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులంతా కలిసి అభినందనలు తెలిపారు. ఈ తరుణంలోనే అందరూ కేసీఆర్ కాళ్లకు దండం పెట్టారు. సీఎం కంటే వయస్సు ఎక్కువ ఉన్నవారు సైతం ఒంగి దండెంపట్టారు. మెప్పుకోసం ఈ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. కానీ మంత్రులు సబిత, కేటీఆర్ మాత్రం దండం పెట్టలేదు. కేవలం పుష్పగుచ్ఛం మాత్రమే ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దండంపెట్టక పోవడం విమర్శలకు దారితీస్తుంది.

Advertisement

Next Story