- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: TSPSC పేపర్ల లీకేజీ వెనుక రాజకీయ కోణం.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై భగ్గుమన్న నిరుద్యోగులు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని టీఎస్పీఎస్సీ అధికారులపై, రాష్ట్ర సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ స్కామ్ వెనుక రాజకీయ కోణం ఉండవచ్చని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇందులో భాగంగా టీఎస్సీఎస్సీ పేపర్ల లీక్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్ బీజేపీ కార్యకర్త అని కేటీఆర్ అతడి ఫొటోలు షేర్ చేశారు. అంతేకాకుండా ఆ పేపర్ల లీక్ స్కామ్ వెనుక ఉన్న సూత్రధారులను కనిపెట్టాలని ఆయన కోరారు. ఈ పేపర్ల లీక్ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాలని.. ఈ ఘటనపై డీజీపీ సమగ్ర విచారణ జరపాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లేందుకే బీజేపీ కుట్ర చేసినట్లు అనిపిస్తోందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. అమాయకుల జీవితాలను నాశనం చేసేందుకే ఈ కుట్ర పన్నారని అన్నారు. పేపర్ల లీక్ వెనుక రాజకీయ కోణం ఉందని స్వయంగా మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది.