- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి KTR కామారెడ్డి మీటింగ్ క్యాన్సిల్.. స్ట్రాటజీ చేంజ్..!
దిశ, కామారెడ్డి : సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో సీఎంతో ముఖ్య నాయకుల సమావేశం ఇప్పటిదాకా వాయిదా పడుతూనే వచ్చింది. గతంలో ప్రగతి భవన్‌లో ముఖ్య నాయకులతో సీఎం సమావేశం అవుతారని భావించినా అనివార్య కారణాలతో వాయిదా పడింది. దాంతో బిక్కనూర్‌లో ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారని భావించినా అది కూడా రద్దై ఆ సమావేశాన్ని మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆ రోజు ముఖ్య నాయకుల మధ్య విబేధాలపై కేటీఆర్ ఘాటుగానే స్పందించి నాయకులకు చురకలు అంటించారు. ముందు ఇంటిని చక్కదిద్దుకుని బయటకు వెళ్లాలని హెచ్చరించారు. పంచాయతీలు పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేసినా నాయకుల్లో మార్పు రాలేదని ప్రచారం సాగింది. దాంతో నేడు కామారెడ్డిలో ముఖ్య నాయకులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహిస్తారని, కేసీఆర్ గెలుపు కోసం విభాగాల వారిగా బాధ్యతలు అప్పగించడంతో పాటు నాయకుల సమన్వయ లేమిని చక్కదిద్దుతారని ప్రచారం సాగింది. అనుకోకుండా మంత్రి సమావేశం రద్దయి ప్రగతి భవన్‌కు మకాం మారింది.
సీఎంతోనే మీటింగ్
కేటీఆర్‌తో కామారెడ్డిలో సమావేశం రద్దయిన సమాచారాన్ని నిన్న సాయంత్రం ముఖ్య నాయకులకు చేరవేశారు. ప్రత్యేక బస్సులలో మధ్యాహ్నం 12 గంటల లోపు ప్రగతి భవన్ లో ఉండేలా రావాలని సమాచారం ఇవ్వడంతో ముఖ్య నాయకులతో పాటు వంద మందికి పైగా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక బస్సులలో నేటి ఉదయమే ప్రగతి భవన్ బయలుదేరారు. నియోజకవర్గంలో 266 పోలింగ్ బూత్ లకు ఒక్కొక్క బూత్ కు ఇంఛార్జీలను నియమించారు. వీరికి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
సమన్వయం జరిగేనా..?
కామారెడ్డిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. దీనిపై ఇప్పటికే మంత్రి కేసీఆర్ హెచ్చరించినా ఫలితం లేకుండా పోయిందన్న ప్రచారం సాగుతోంది. దాంతో సీఎం కేసీఆర్ నేరుగా నాయకుల మధ్య విబేధాలపై సీరియస్ గా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య సమన్వయం జరుగుతుందా..? ఎవరికి వారే అన్నట్టుగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. అధినేతే నేరుగా మాట్లాడనుండటంతో ఇకనైనా నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్తారనే అందరూ భావిస్తున్నారు. సీఎం సమావేశం అనంతరం నాయకుల్లో నూతనోత్సాహం కలుగుతుందన్న ఆశాభావం నేతల్లో నెలకొంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.