AP Govt:బీసీ మహిళలు, యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

by Jakkula Mamatha |
AP Govt:బీసీ మహిళలు, యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీ మహిళలకు, నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పనుంది. బీసీలకు సంక్షేమ పథకాలు(Welfare schemes), స్వయం ఉపాధి(Self employment) పథకాలను అందించడానికి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొన్ని పథకాలను రూపొందించి సీఎం చంద్రబాబుకు పంపించారు. వీటికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సంక్షేమ పథకాల అమలు జరుగుతుంది. దీంతో దాదాపు 80 వేల మంది BC, EBC మహిళలకు 90 రోజుల పాటు టైలరింగ్ పై శిక్షణ(trainings) ఇవ్వనుంది. ఆ తర్వాత రూ.24,000 విలువైన కుట్టు మిషన్లు అందిస్తుంది. అలాగే ఢీ ఫార్మా, భీ ఫార్మసీ కోర్సులు చేసిన యువత జనరిక్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు రూ.8 లక్షలు సాయం చేయనుంది. ఇందులో రూ.4లక్షలు సబ్సిడీ, రూ.4లక్షలు రుణంగా ఉంటుంది. ఈ మేరకు త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed