LeT’s deputy leader: లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి

by Shamantha N |
LeT’s deputy leader: లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తొయిబాకు చెందిన డిప్యూటీ చీఫ్(LeT’s deputy leader) హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ(Abdul Rehman Makki) మృతి చెందాడు. గుండెపోటు కారణంగా చనిపోయినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రొఫెసర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. కాగా.. మధుమేహం కారణంగా లాహోర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 2020లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో యాంటీ టెర్రరిజం కోర్టు మక్కీకి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో శిక్ష పడిన తర్వాత నుంచి మక్కీ లో ప్రొఫైల్ ని మెయింటెన్ చేస్తున్నాడు. మక్కీ పాకిస్థాన్ భావజాలవాది అని పాకిస్థాన్ ముతాహిదా ముస్లిం లీగ్ (PMML) ఒక ప్రకటనలో పేర్కొంది. 2023లో ఐక్యరాజ్యసమితి(United Nations) అతడ్ని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించింది. అతని ఆస్తులు స్తంభింపజేయడం, ప్రయాణాలపై నిషేధం, ఆయుధాలపై నిషేధం విధించింది.

ముంబై ఉగ్రదాడిలో..

అంతేకాకుండా, ముంబై దాడుల్లో మక్కీ నిందితుడిగా ఉన్నాడు. ముంబై ఉగ్రకుట్ర సూత్రధారి హఫీజ్ సయీద్ తో మక్కీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం డిసెంబర్ 26, 2008న పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గం గుండా ముంబైకి వచ్చి నగరాన్ని ముట్టడించింది. ఉగ్రదాడిలో దాదాపు వందమందికి పైగా చనిపోయారు. ఇకపోతే, ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు వార్తలొచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed