జగన్‌దే విద్యుత్ ఛార్జిల భారం: ఎమ్మెల్యే పత్తిపాటి సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-12-27 08:57:56.0  )
జగన్‌దే విద్యుత్ ఛార్జిల భారం: ఎమ్మెల్యే పత్తిపాటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్(Ycp Chief Ys Jagan)అవినీతిలో భాగమే విద్యుత్ ఛార్జిల(Electricity charges) భారమని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు(Mla Pattipati Pullarao)అన్నారు. వైసీపీ చేపట్టిన నిరసనలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ ఛార్జిల పెంపు నిరసన కొత్త డ్రామా అని కొట్టిపారేశారు. అధికారం పోవడంతో ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న మద్దతు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. విద్యుత్ చార్జిల పెంపునకు ఈఆర్సీక ప్రతిపాదనలు పంపందే జగన్ అని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లల్లో రాష్ట్ర విద్యుత్ రంగానికి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ. లక్షా 29 వేల 5.3 కోట్లు నష్టం చేశారని ఆరోపించారు. గత ఐదేళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జిలు పెంచి రూ.32, 166 కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed