- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఆడబిడ్డలకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ పరిగిలో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే సౌభాగ్యలక్ష్మీ పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు నెలకు 3 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఇంకో ఏడాదిలోనే పరిగికి కృష్ణా నది నీళ్లు తీసుకొస్తామని తెలిపారు. తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు.. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇళ్లు లేదని వెల్లడించారు. 55 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కరెంట్, నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్లలోనే కరెంట్, నీళ్లు ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతు బంధు స్కీమ్ కూడా తీసుకొచ్చిందన్నారు. ఇప్పటికే 75 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్లు అందించామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల బీమా ఇచ్చేలా డిసెంబర్ 3 తర్వాత కొత్త పథకం అమలులోకి వస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌ను మాత్రం గెలిపిస్తే ఆరు నెలలకు ఒక ముఖ్యమంతి మారడం గ్యారెంటీ అని కేటీఆర్ తేల్చి చెప్పారు.