- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సొంత నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్‌కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. సోమవారం రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు మధ్య వెళుతున్న మంత్రి కాన్వాయ్‌ని ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సంజీవయ్య నగర్‌లో కేటీఆర్ కాన్వాయ్‌కి ఎదురెళ్లిన కార్యకర్తలు, ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటిఆర్ వెంటనే రాజీనామా చేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. అయితే, మంత్రి కేటిఆర్‌ను అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.