బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి KTR ఫైర్..

by Mahesh |   ( Updated:2022-12-10 05:48:42.0  )
బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి KTR ఫైర్..
X

దిశ, వెబ్‌డెస్క్: బాసర ట్రిపుట్ ఐటిని మరో సారి తెలంగాణ మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గతంలో చెప్పిన విధంగా విద్యార్థులకు లాప్ టాప్ లు అందించారు. అలాగే తగంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలపై ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి ఫైర్ అయినట్లు తెలుస్తుంది. విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఎంత వరకు వచ్చాయని అధికారులను నిలదీసినట్లు సమాచారం. అలాగే ఇంత జరుగుతున్నా.. ఇంత మంది మంత్రులు, అధికారలు ఉండి కూడా ఎందుకు మెస్ కాంట్రాక్టర్లను ఇంకా ఎందుకు మార్చలేదని అధికారులని ప్రశ్నించారు. అలాగు ఈ విషయం పై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారని.. తమ పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని అధికారులను మంత్రి కేటీఆర్ మందలించారు.

Advertisement

Next Story